
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఒక బోటుతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మిగితా బోట్లకు వ్యాపించాయి. దీంతో 40 బోట్లు దగ్ధం అయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే బోట్లకు నిప్పు పెట్టారని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో లక్షల్లో ఆస్తినష్టం సంభవించిందని బోటు యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
సుమారు 25 నుంచి 30 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.