హనుమకొండ హరిత హోటల్లో భారీ అగ్ని ప్రమాదం

హనుమకొండ జిల్లా హరిత హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.    ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  హోటల్ ఉద్యోగులు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.  దీంతో పెను ప్రమాదం తప్పింది.  

 ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బందిని విచారిస్తున్నారు. కిచెన్ లో ఏదైనా సిలిండర్ పేలిందా? లేక  షాట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.