రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

పెద్దపల్లి జిల్లాలో రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో మంగళవారం (అక్టోబర్ 24 న) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముందుగా పవర్ స్టేషన్​లోని కంట్రోల్​రూమ్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున వ్యాపించాయి. భారీ అగ్ని ప్రమాదంతో ఎంత మేర ఆస్తినష్టం వాటిల్లిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అగ్ని ప్రమాదంతో TSGENCO  కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలపై TSGENCO అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. షార్ట్​ సర్క్యూట్​వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. బొగ్గు శక్తి కర్మాగారాన్ని తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO) నిర్వహిస్తోంది.