హైదరాబాద్ లోని మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఐదు అంతస్తుల సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Also Read :- ఆకాశంలో అద్భుతం... పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటలు
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నారు.