జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్ లో ఆదివారం (అక్టోబర్ 27) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి షాప్ మొత్తం మంటలు వ్యాపించాయి. పక్క షాపులకు కూడా మంటలు అంటుకోవడం ప్రారంభించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.
సరిగ్గా అదే టైంకి ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఆయిపోయాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చేసేదేంలేక ఇక స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. జేసీబీ సాహాయంతో కూడా మంటలు ఆర్పడానికి ట్రై చేశారు. అయినప్పటికీ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, భారీ ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.