హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (MS 3) వెనక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 18) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పొలిటిషియన్స్ నివసించే ఏరియా కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.