హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ బిచాణా ఎత్తేసింది. స్క్వేర్ అండ్ యాడ్స్ ఫామ్‌హౌస్ విల్లాల పేరుతో భారీ మోసం జరిగినట్టు వెలుగులోకొచ్చింది. స్క్వేర్ అండ్ యాడ్స్ యాజమాన్యంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్క్వేర్ అండ్ యాడ్స్ యజమాని బైరా చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు. బైరా చంద్రశేఖర్‌తో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్‌లు, విల్లాల పేరుతో డబ్బులు వసూలు చేసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. రూ.24 కోట్లు వసూలు చేసి బైరా చంద్రశేఖర్ చేతులెత్తేశాడు. ఫామ్‌హౌస్, విల్లా కోసం పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు.