![పెళ్లికి వెళ్లొచ్చే సరికి ఇల్లు లూటీ .. 40 తులాల బంగారం ఎత్తుకెళ్లారు](https://static.v6velugu.com/uploads/2025/02/a-huge-gold-theft-took-place-in-a-house-in-saipur-tandoor-town-of-vikarabad-district_FcIR6nqXg4.jpg)
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇల్లు గుళ్ల చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు చూసి అందినకాడికి దోచేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లోని ఓ ఇంట్లో భారీగా బంగారం చోరీ జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, 40 తులాల బంగారం ఎత్తుకెళ్ళారు దుండగులు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుండగుల కోసం ప్రత్యేకంగా రంగంలో దిగిన పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ALSO READ | ఫోన్ ఎత్తొద్దు.. మళ్లా చేయొద్దు మిస్డ్‌కాల్స్‌తో అకౌంట్స్ హ్యాక్