చేపల వలలో కొండ చిలువ

కొల్చారం, వెలుగు : మెదక్​ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం చెరువు అలుగు పారుతోంది. చేపలు నీటిలో వెళ్లిపోకుండా మత్స్యకారులు వల ఏర్పాటు చేశారు. అందులో సోమవారం కొండ చిలువ చిక్కింది. ఉదయం అటుగా వెళ్లిన రైతులు దాన్ని గమనించి ఫారెస్ట్​అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి తీసుకళ్లారు. 

ALSO READ:గాంధీ డైట్ క్యాంటీన్​లో.. నిలిచిన డ్రైనేజీ నీరు