స్పీడందుకున్న నామినేషన్లు..ఒక్క రోజే 51 నామినేషన్లు

  •     అత్యధికంగా భూపాలపల్లిలో 9 
  •     నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల క్యాండిడేట్లు

వరంగల్‍/హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల లీడర్లు నామినేషన్లు అందజేశారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ తూర్పు నియోజకవర్గానికి నాలుగు నామినేషన్లు రాగా  ఇందులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ నన్నపునేని నరేందర్‍, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఇజ్జగిరి కమలాకర్‍, ఎంసీపీఐ(యూ) తరఫున సుంచు జగదీశ్‌‌‌‌‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా ఆర్‍.రవీందర్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమలో అలయెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెమొక్రటిక్‍ రిఫార్మ్స్‌‌‌‌‌‌‌‌ పార్టీ తరఫున గట్ల యుగంధర్‌‌‌‌‌‌‌‌, ఇండిపెండెంట్లుగా గొల్లెన నరేందర్‍, పూసల సత్యప్రకాశ్‍, బంక రాజు, గుర్రం శాంతమ్మ, సాయిని రవీందర్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. నర్సంపేటలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇండిపెండెంట్లుగా ఇమ్మడి బాబు, మొగిలి ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వర్ధన్నపేటలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కేఆర్‍.నాగరాజు, ఏంసీపీఐ(యూ) నుంచి కొత్తపల్లి సావిత్రి, ధర్మ సమాజ్‌‌‌‌‌‌‌‌ పార్టీ నుంచి రొడ్డ మురళీకృష్ణ నామినేషన్లు వేశారు. పరకాలలో పెండెల కుమారస్వామి, బానోత్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేయగా, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి సంగెకారి యువరాజ్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ పేపర్స్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. 

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, డోర్నకల్‌‌‌‌‌‌‌‌లో నాలుగు చొప్పున...

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్, డోర్నకల్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్లకు బుధవారం ప్రధాన పార్టీ క్యాండిడేట్లు నామినేషన్లు వేశారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ బానోత్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ భుక్యా మురళీనాయక్‌‌‌‌‌‌‌‌, బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ జాటోత్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌, న్యూడెమోక్రసీ తరఫున బట్టు భిన్నమ్మ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. డోర్నకల్‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరఫున రెడ్యానాయక్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నుంచి భుక్యా సంగీత, ఇండిపెండెంట్లుగా భుక్యా గోపీకృష్ణ, అజ్మీర రత్న నామినేషన్‌‌‌‌‌‌‌‌ పేపర్స్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. 

ములుగులో మూడు

ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గంలో బుధవారం మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అంకిత్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున సీతక్క నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేయగా, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రెబల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా పోరిక పోమానాయక్‌‌‌‌‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా మల్యాల మనోహర్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. 

జనగామ జిల్లాలో 12

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి బుధవారం 12 నామినేషన్లు వచ్చాయి. జనగామలో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా జంగా సుజాత , ధర్మసమాజ్‌‌‌‌‌‌‌‌ పార్టీ నుంచి గొల్లపల్లి చిరంజీవి, రిపబ్లికన్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫ్​ఇండియా నుంచి మంతెన నరేశ్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి సింగపురం ఇందిర, ఇండిపెండెంట్లుగా బొల్లెపాక రాజేశ్‌‌‌‌‌‌‌‌, శాగ రాజు, దండెం రత్నం రెండు సెట్లు, పాలకుర్తిలో బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా లేగ రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు ఎర్రబెల్లి ఉషాదేవి, జెర్రిపోతుల ఉపేందర్‌‌‌‌‌‌‌‌, మన్యపు భుజేందర్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. 

భూపాలపల్లిలో 9

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : భూపాలపల్లి నియోజకవర్గానికి బుధవారం తొమ్మిది నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున గండ్ర సత్యనారాయణరావు, సీపీఐ నుంచి వంగర సారయ్య, అలయెన్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డెమొక్రటిక్‍ రిఫార్మ్స్‌‌‌‌‌‌‌‌ పార్టీ తరఫున తాళ్లపల్లి రమేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, సీపీఐఎంఎల్‌‌‌‌‌‌‌‌ లిబరేషన్‌‌‌‌‌‌‌‌ నుంచి మారపల్లి మల్లయ్య, బీఎస్పీ నుంచి గజ్జి జితేంధర్‌‌‌‌‌‌‌‌, యుగ తులసి పార్టీ నుంచి పొన్నం బుచ్చయ్య, ఇండిపెండెంట్లుగా అల్లం మహేశ్‌‌‌‌‌‌‌‌, సిరిపెల్లి రాజయ్య నామినేషన్లు వేశారు.