న్యూఢిల్లీ: ఫిన్నిష్ టెలికం గేర్ సరఫరాదారు నోకియా 4జీ, 5జీ పరికరాలను సరఫరా చేయడానికి ఎయిర్‌టెల్ నుంచి బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని గెలుచుకుంది. నెట్వర్క్ను పెంచడానికి బేస్ స్టేషన్‌లు, బేస్ బ్యాండ్ యూనిట్లు తాజా తరం ఎంఐఎంఓ రేడియోలతో సహా పలు పరికరాలను ఎయిర్‌టెల్ కోసం నోకియా మోహరిస్తుంది. పలు సంవత్సరాలపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. మనదేశంలోని ముఖ్య నగరాల్లో, రాష్ట్రాలలో 4జీ, 5జీ పరికరాలను నోకియా అమర్చుతుంది. నోకియా రెండు దశాబ్దాలుగా ఎయిర్టెల్కు నెట్‌వర్క్ పరికరాలను అందిస్తోందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.