వరంగల్లో బీఎస్పీ భారీ బహిరంగ సభ

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇవ్వాళ  వరంగల్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌, రాష్ట్ర ప్రధాన సమన్వయకర్త మంద ప్రభాకర్‌, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఖిలశాపూర్ లో ప్రారంభించిన యాత్ర..జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం పామలగడ్డలో యాత్ర పూర్తి చేశారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. సభకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు కేయూ ప్రాంగణంలోని ఫులే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి బీఎస్పీ నేతలు నివాళులర్పించనున్నారు.హన్మకొండలోని అంబేడ్కర్‌ విగ్రహానికి, అమరవీరులకు పూలమాలలు వేసి నివాళి అర్పించనున్నారు బీఎస్పీ నేతలు. వరంగల్లో సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది.