మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్లోకి భారీ కొండచిలువ వచ్చింది. పోలీస్ స్టేషన్ ప్రహరీ ముళ్లకంచెలో చిక్కుకొని చాలాసేపు నరకయాతన అనుభవించింది కొండచిలువ. విషయం తెలుసుకున్న పోలీసులు స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.ముళ్ల పెన్సింగ్ కు చిక్కుకోవడం వల్ల కొండచిలువకు రక్తస్రావం అయ్యింది.
అటవీ అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కొండచిలువ కు ప్రథమ చికిత్స చేసి రెండుచోట్ల తెగిన శరీరానికి కుట్లు వేసి పాముని రక్షించారు డాక్టర్లు.అనంతరం జిల్లా అటవీ అధికారులు కొండచిలువని ఎల్లారం ఫారెస్ట్ రేంజ్ లో క్షేమంగా వదిలిపెట్టారు.
పోలీస్ స్టేషన్లో భారీ కొండచిలువ.. ముళ్లకంచెలో చిక్కుకుంది పాపం.. pic.twitter.com/I5NSy8NgTK
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) September 19, 2024