దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. బైక్ లపై వచ్చిన నలుగురు దుండగులు ఓ కారును ఆపి రూ.2 లక్షలు ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ సన్నివేశం ఆదివారం నాడు ప్రగతి మైదాన్ టన్నెల్ లో చోటుచేసుకుంది. అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో ఇదంతా రికార్డయింది.

ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ కేంద్ర ప్రCiభుత్వం, ఎల్జీపై విమర్శలు గుప్పించారు. ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేసి మరో సమర్థుడైన ఎల్జీ నియామకానికి తోడ్పడాలని చెప్పారు. ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడడం చేతకాకపోతే ఆ బాధ్యతను ఆప్ సర్కారుకు అప్పగించాలని, ప్రజల రక్షణ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.

ALSO READ:నల్లగొండ ఫ్రూట్ మార్కెట్​లో పేలుడు.. ఇద్దరు మృతి

అసలేం జరిగిందంటే..

ఢిల్లీ రెడ్​ ఫోర్ట్ ఏరియాకు చెందిన డెలివరీ ఏజెంట్ ఒకరు గురుగ్రామ్ లో క్యాష్ ఇచ్చి వచ్చేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కస్టమర్ కు అందజేయాల్సిన రూ.2 లక్షల నగదును ఓ బ్యాగులో సర్దుకుని సహాయకుడితో కలిసి కారు లో బయలుదేరాడు. ప్రగతి మైదాన్ టన్నెల్​లోకి ఎంటరైన కాసేపటికి 2 బైకులపై వెనకే వచ్చిన నలుగురు దుండగులు కారును ఆపారు. గన్ చూపించి బెదిరిస్తూ డెలివరీ ఏజెంట్ దగ్గరి నుంచి బ్యాగ్ లాక్కొని బైక్ లపై పరారయ్యారు.  సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. కాగా, ఈ దోపిడీపై పోలీసులు స్పందిస్తూ.. డెలివరీ సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.