మనిషా మృగమా : భార్యను అత్యంత కిరాతకంగా వేధించి చంపిన భర్త

మనిషా మృగమా : భార్యను అత్యంత కిరాతకంగా వేధించి చంపిన భర్త

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ లో దారుణం జరిగింది. మానవత్వం మరచి అతి క్రూరంగా కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. పిల్లలు ఏమైపోతారోననే కనీస ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా చంపేశాడు ఓ సైకో తాగుబోతు భర్త.

వివరాల్లోకి వెళ్తే.. కోకాపేట్ లో నివసిస్తున్న ముత్యాలు తన భార్య సునీతను గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో భార్యను చంపి బయటి నుండి తలుపులు వేశాడు హంతకుడు. ఆ తర్వాత తన భార్య ను చంపానంటూ కాలనీ వాసులకు చెప్పి.. నార్సింగీ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 

 తాగుడుకు బానిసైన ముత్యాలు భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. డబ్బులు కావాలంటూ తరచూ గొడవ పడేవాడు. తప్పతాగి వచ్చి రాత్రుల్లో భార్యపై దాడికి దిగేవాడు.  నాలుగు నెలల క్రితం భార్య మర్మాంగాలలో కీర దోసకాయ పెట్టిన అత్యంత రాక్షసంగా, కిరాతకంగా వ్యవహరించాడు. అలాగే 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆసుపత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు.

Also Read :- 71 ఏళ్ళ సీనియర్ నటుడితో 31 ఏళ్ళ నటి లవ్ ఎఫైర్

 దాడి చేసిన ప్రతీసారి విషయం బయటకు పొక్క కుండా జాగ్రత్త పడేవాడు సైకో భర్త. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్తింగ్ ఇచ్చేవాడు. చివరికి అన్నంతపని చేశాడు ఈ కసాయి భర్త. శుక్రవారం భార్యను హత్యచేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అయితే సైకో ముత్యాలుకు సునీత రెండవ భార్య. వేధింపులు భరించలేక మొదటి భార్య  ముత్యాలును వదిలి పారిపోయింది. రెండో భార్య సునీత పిల్లల కోసం ముత్యాలు అగాయిత్యాలను భరిస్తూ వచ్చినప్పటికీ.. చివరికి కసాయి చేతిలో దారుణంగా హత్యకు గురై చనిపోయింది.