అరుణాచల్‌ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో సుబన్ సిరి నదికి ఉపనది అయిన హీయో నదిపై హియో జల విద్యుత్తు ప్రాజెక్టు (హీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ –హెచ్ఈపీ)ని రూ.1939 కోట్లతో నిర్మించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 50 నెలల్లో పూర్తికానున్నది.
సామర్థ్యం: హీయో హెచ్ఈపీ స్థాపిత సామర్థ్యం 240 మెగావాట్లు, ఇందులో 80 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1000 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనున్నది. ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(ఎన్ఈఈపీసీఓ)లు సంయుక్తంగా అమలు చేస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యాలకు, ఉద్దేశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు స్థానిక రవాణా సంస్థలకు, వ్యాపార సంస్థలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)లకు అనేక ప్రయోజనాలను అందించనున్నది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో జల విద్యుత్ సామర్థ్యం: రాష్ట్రంలో జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 58,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భారత్దేశం మొత్తం జలవిద్యుత్ సామర్థ్యంలో సుమారు 40 శాతం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది.
షియోమి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులు
టాటో–1 హెచ్ఈపీ(186 మెగావాట్లు)
పౌక్ హెచ్ఈపీ (145 మెగావాట్లు)
టాటో–2 హెచ్ఈపీ(700 మెగావాట్లు)
నాయింగ్ హెచ్ఈపీ (1000 మెగావాట్లు)
హిరోంగ్ హెచ్ఈపీ (500 మెగావాట్లు)
రెగో హెచ్ఈపీ (70 మెగావాట్లు)
రాపమ్ హెచ్ఈపీ (80 మెగావాట్లు)
కంగ్తంగర్షిరి హెచ్ఈపీ (80 మెగావాట్లు)