హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న (48) , ఆయన కుమారుడు సురేష్ (12) గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్ రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి పలు ఆధారాలను సేకరించారు. చెత్త నుంచి స్క్రాప్ సేకరిస్తుండగా ఈ పేలుడు జరిగిందని వెల్లడించారు.