
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ.జగన్ గెలుపొందారు. సమీప పత్యర్థి ఎస్.సురేందర్‌రెడ్డిపై 990 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. జగన్‌కు 1,724 ఓట్లు రాగా, సురేందర్ రెడ్డికి 734 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
ఉపాధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి (1,176 ఓట్లు), కార్యదర్శులుగా ఖాజా విజారత్ అలీ (1,154), ఇంద్రసేనారెడ్డి నూకపల్లి (1,034), సంయుక్త కార్యదర్శిగా అనిరుధ్ నెల్లికొండ (1,125), ట్రెజరర్‌గా పాపయ్య పెద్దాకుల (1,448), స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాములు (1,543) విజయం సాధించారు.
15 ఏండ్ల సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా హనుమంతరావు గుడిపాటి (1,496), మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్‌టీ లావణ్య (1,874)తో పాటు జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎం.అంజలి దేవి (1,708), బి.శిరీష (1,488), వై.ప్రకాశ్ (1,402), కె.నరేశ్ (1,372) గెలుపొందారు.
ఎన్‌సీఎల్‌టీ బార్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్‌రావు..
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎల్.వెంకటేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా టి.విజయ్‌కుమార్ రెడ్డి, కార్యదర్శిగా రాజశేఖర్ సల్వాజి, కోశాధికారిగా సి.తులసీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఏవీ రోహన్ రావు, సి.రోహిణి స్మిత, కె. శ్రీరమ్య ఎన్నికయ్యారు.