ఇది న్యాయమేనా..?: 46 ఏళ్లు జైల్లో పెట్టి ఇప్పుడు నిర్దోషివి అన్నారు

ఇది న్యాయమేనా..?: 46 ఏళ్లు జైల్లో పెట్టి ఇప్పుడు నిర్దోషివి అన్నారు

బెర్లిన్: ప్రపంచంలోనే అత్యధిక కాలం మరణశిక్ష పడిన ఖైదీ ఇవావో హకమడను జపాన్ అత్యున్నత నాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 46 ఏళ్ల మరణశిక్ష తర్వాత  ఇవావో హకమడను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కాగా, మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ అయిన ఇవావో హకమడపై 1968లో మర్డర్ కేసు నమోదైంది. తన బాస్‎తో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసులో జపాన్ కోర్టు ఇవావో హకమడకు మరణశిక్ష విధించింది. 

అయితే, ఇవావో హకమడపై తప్పుడు కేసు నమోదు చేశారని.. ఈ హత్యలతో అతడికి  సంబంధం లేకున్నా పోలీసులు బలవంతంగా ఒప్పించారని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఘటన స్థలంలో దొరికిన దుస్తులపై ఉన్న రక్తపు మరకలు కూడా ఇవావో హకమడవి కాదని.. ఇదే విషయం డీఎన్ఏ రిపోర్టులో కూడా తేలిందని.. ఆ బట్టలు అతనిని దోషిగా ఉంచడానికి ఘటన స్థలంలో ఉపయోగించారని నిందితుడి తరుఫు లాయర్లు వాదించారు. డీఎన్ఏ రిపోర్టు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం 2014లో  హకమడను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించింది.

ALSO READ | Hassan Nasrallah: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

 దీంతో 46 ఏళ్లు చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించిన హకమడ.. కోర్టు ఆదేశాల అనంతరం జైలు నుండి బయటకు వచ్చాడు.  హకమడ బయటకు జైలు నుండి రిలీజ్ అయినప్పటికీ న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ నడిచింది. ఈ క్రమంలోనే దశాబ్ధాల పాటు నడిచిన హకమడ కేసులో 26 సెప్టెంబర్, 2024న జపాన్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన హకమడ నిర్దోషి అని న్యాయస్థానం ప్రకటించింది. అతనికి వ్యతిరేకంగా ఉపయోగించిన సాక్ష్యాలు కల్పితమని తేల్చి చెప్పింది.