- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
- బిల్లు కట్టించుకున్నాక చనిపోయినట్లు చెప్పారని ఆగ్రహం
- క్రిటికల్ కండిషన్లో అడ్మిట్ చేశారన్న హాస్పిటల్యాజమాన్యం
మాదాపూర్, వెలుగు : మల్టిపుల్ఆర్గాన్స్ ఫెయిలై ఓ జూనియర్డాక్టర్మృతి చెందింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యమే యువతి మృతికి కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు, హాస్పిటల్యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన నాగప్రియ(28) మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జూనియర్డాక్టర్గా పనిచేస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు సిటీలోని పలు ప్రైవేట్ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ఇప్పించారు.
పరిస్థితి విషమించడంతో తెలిసిన డాక్టర్సూచన మేరకు ఈ నెల 4న మాదాపూర్మెడికవర్హాస్పిటల్ లో అడ్మిట్‌చేశారు. నాగప్రియకు మల్టిపుల్ఆర్గార్స్ఫెయిల్అయినట్లు అక్కడి డాక్టర్లు గుర్తించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 2.34 గంటలకు నాగప్రియ మృతి చెందినట్లు హాస్పిటల్వర్గాలు కుటుంబ సభ్యులకు తెలిపాయి. అయితే మంగళవారం రాత్రి బిల్లు కట్టించుకున్నారని
ఆ తర్వాత నాగప్రియ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ అందిస్తున్న టైంలో కనీసం చూడనివ్వలేదని వాపోయారు. రూ.3.40 లక్షలు కట్టిన తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటున్నారని బుధవారం హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు.
ఆరోపణల్లో నిజం లేదు : మెడికవర్ డైరెక్టర్
నాగప్రియ మృతిపై మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఆమెను అడ్మిట్చేశారని, వెంటిలేటర్‌తో తమ హాస్పిటల్‌కు వచ్చిందని చెప్పారు. మల్టిపుల్ఆర్గాన్స్ దెబ్బతినడంతో వెంటిలేటర్‌పైనే ట్రీట్మెంట్కొనసాగించామని తెలిపారు. పేషెంట్కండిషన్ను కుటుంబ సభ్యులకు ముందే తెలియజేశామన్నారు.
మొత్తం రూ.5.40 లక్షలు బిల్లు అయిందని, రూ.2 లక్షలు ముందే కట్టారని చెప్పారు. మృతురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మిగిలిన రూ.3.30 లక్షల్లో రూ.30 వేలు మాత్రమే కట్టించుకుని మృతదేహాన్ని అప్పగించామని వెల్లడించారు.