పిట్లం,వెలుగు: 46 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్న తనను కాదని నాన్‌లోకల్ వారికి ఎలా టికెట్ఇచ్చారంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ అధిష్టానంపై ఫైర్అయ్యారు. ఆదివారం పెద్దకొడప్గల్లో తన నివాసం లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు.
బోధన్ కాంగ్రెస్అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, తనకో న్యాయమా అని ప్రశ్నించారు. 1991లో సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్అభ్యర్థి బాలాగౌడ్కోసం కాకుండా టీడీపీ అభ్యర్థి కేశ్‌పల్లి గంగారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారని, 2019 ఎంపీ ఎన్నిక్లలోనూ ధర్మపురి అర్వింద్‌కు మద్దతిచ్చి మధుయాష్కి ఓటమికి కారణమయ్యాడన్నారు.
పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఆయనకు టికెట్ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జుక్కల్‌లో తనకు కేడర్ లేదంటున్న వారికి ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. తన అభిమానులు, అనుచరులు కారుగుర్తుకు ఓటెయాలని సూచించారు. తనను పార్టీ సస్పెండ్ చేసినా భయపడేది లేదన్నారు.
కామారెడ్డి: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారాంను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.