మరో రెండు రోజుల్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన

మరో రెండు రోజుల్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన

మరో రెండు మూడు రోజుల్లో ఏపీ రాజధానిపై ఓ క్లారిటీ రానుంది. గత కొన్ని రోజులుగా రాజధాని విషయంలో ఏపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి తెరదించుతూ ప్రభుత్వం నుంచి రాజధాని మార్పుపై ఓ స్పష్టమైన ప్రకటన రానుంది. దీంతో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులు భారీగా తరలివస్తున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. యర్రబాలెం లోని ఓ కళ్యాణ మండపంలో సుమారు 300 మంది పోలీసులకు అధికార యంత్రాంగం వసతి ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలును ఏపీ రాజధానులుగా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదివరకే ప్రతిపాదించారు.