నో CBT.. ఓన్లీ పెన్ అండ్ పేపర్: నీట్ ఎంట్రెన్స్ విధానంలో కీలక మార్పు

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌ సహా యూజీ- వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ (NEET) పరీక్ష విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక మార్పులు చేసింది. నీట్-2025 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో కాకుండా పెన్ అండ్ పేపర్‌ (ఓఎంఆర్)  పద్దతిలో నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. ఒకే రోజు, ఒకే ఫిష్ట్‎లో దేశమంతటా నీట్ 2025 ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. 

ALSO READ | మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్

కాగా, గతేడాది నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి అలాంటి ఘటనలు  చేసుకోకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది. ఇక, నీట్ 2025 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ తేదీ, ఎగ్జామ్ డేట్‎లను ఎన్డీఏ ఇంకా వెల్లడించలేదు. గత ఏడాది మాదిరిగానే.. ఫిబ్రవరి చివర్లో లేదా.. మార్చి తొలివారం అప్లికేషన్లు మొదలు అయ్యే అవకాశం ఉంది. దీనిని ఎన్టీఏ ధృవీకరించలేదు. త్వరలోనే పరీక్ష షెడ్యూల్‎ను విడుదల చేస్తామని తెలిపింది.