నకరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఒక నిందితుడితో ఆయన సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో పోలీసులు చిరుమర్తికి విచారిస్తున్నారు. చిరుమర్తి విచారణ అనంతరం మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.