![క్రియేటివిటీ పెంచే కిడ్స్ కెమెరా](https://static.v6velugu.com/uploads/2025/02/a-kids-camera-that-boosts-creativity_PfD5kYLCqQ.jpg)
పిల్లలకు చదువుతోపాటు క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. మరి క్రియేటివిటీ పెరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి గాడ్జెట్స్ ఇస్తుండాలి. ఈ కిడ్స్ కెమెరాని టాయ్ ఇమాజిన్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో 1080పీ హ్చ్డీ వీడియోలు తీయగలిగే కెమెరా ఉంటుంది.
పిల్లలు దీంతో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల వినోదంతోపాటు క్రియేటివిటీ పెరుగుతుంది. దీనికి 2-అంగుళాల ఐపీస్ డిస్ప్లే ఉంటుంది. తీసిన వీడియోలు, ఫొటోలను అందులో చూసుకోవచ్చు. దీన్ని యూఎస్బీతో రీచార్జ్ చేసుకోవచ్చు. పిల్లలు వాడేందుకు కాంపాక్ట్‌గా ఉండేలా దీన్ని తయారుచేశారు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.
ధర
679