లవర్‌‌కు పెండ్లైందని.. యువకుడి అత్మహత్య

నార్కట్​పల్లి, వెలుగు:  తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెండ్లి కావడంతో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రవి, మృతుడి ఫ్రెండ్స్‌ వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో హర్దగా జిల్లా బెడల్ టాంగ్రా ప్రాంతానికి చెందిన సరోజ్ ఓర్సన్(21) వెలిమినేడు శివారులోని దశమి ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 

Aslo Read  :- కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే శ్రద్ధాంజలి

ఇతను కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఇటీవల మరో వ్యక్తితో వివాహం అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన ఓర్సన్ ఆదివారం అర్ధరాత్రి  పరిశ్రమ బయట ఉన్న చింతచెట్టుకు ఉరివేసుకున్నాడు.  సోమవారం ఉదయం పరిశ్రమలో పనిచేసే కూలీలు యాజమాన్యానికి చెప్పగా.. వారు  పోలీసులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.