శ్రీశైలం ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండచరియలు రాకపోకలు బంద్

శ్రీశైలం ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండచరియలు రాకపోకలు బంద్

శ్రీశైలానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం భారీ వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ సమీపంలో శ్రీశైలం, దోమల పెంట ప్రధాన రహదారి ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు మన్ననూరు టోల్ గేట్ మూసివేశారు. 

శ్రీశైలం వైపు రాక పోకలు నిలిపివేసినట్లు అమ్రాబాద్ పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డు సెక్షన్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వన్ వే ఘాట్ సెక్షన్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రోడ్డుపై పడ్డ పెద్ద బండరాళ్లును తొలగిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. 

Also Read:-హైదరాబాద్ లో అతిభారీ వర్షం పడే ఛాన్స్