- కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్
- ఇండిపెండెంట్లు, రిజిస్టర్డ్ పార్టీల నుంచి భారీగా నామినేషన్లు
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లిలో 14 మంది నామినేషన్లు వేయగా, కరీంనగర్‌లో 13 మంది దాఖలు చేశారు. కరీంనగర్‌లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్పతి తన చాంబర్‌లో నామినేషన్ పత్రాలు స్వీకరించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన వెంట రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఉన్నారు. రాజేందర్ రావు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను వేర్వేరుగా అందజేశారు.
ఇండిపెండెంట్లుగా ఏడుగురు.. రిజిస్టర్డ్ పార్టీల నుంచి ఐదుగురు..
రాజేందర్ రావుతోపాటు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చింత అనిల్ కుమార్, ఎంసీపీఐ అభ్యర్థిగా లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆధార్ పార్టీ అభ్యర్థిగా తాళ్లపల్లి అరుణ, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గట్టు రాణాప్రతాప్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా చిలువేరు శ్రీకాంత్, ఇండిపెండెంట్లుగా దేవునూరి శ్రీనివాస్, బంక రాజు, అబ్బడి బుచ్చిరెడ్డి, గవ్వల లక్ష్మి, జింక శ్రీనివాస్, బరిగె గట్టయ్య యాదవ్, ఎండీ జిషాన్ నామినేషన్ దాఖలు చేశారు.
పెద్దపల్లి స్థానానికి తీవ్ర పోటీ
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి సోమవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, అక్కపాక తిరుపతి(రెండో సెట్) , ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్ , జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్ , జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, జాడి ప్రేమ్‌సాగర్(రెండో సెట్), దాగం సుధారాణి, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.
ఇండిపెండెంట్ అభ్యర్థులు గద్దల వినయ్ కుమార్, బొట్ల చంద్రయ్య తలా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని, 19 నుంచి నామినేషన్ల స్వీకరణ స్టార్ట్ కాగా ఇప్పటివరకు 25 మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. కాగా నామినేషన్లకు 25 వరకే గడువు ఉంది.