- కామారెడ్డి, ఆర్మూర్‌లో బీజేపీ క్యాండిడేట్లకు మద్దతుగా హాజరైన కేంద్రమంత్రులు
- బాల్కొండలో హాజరైన ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్
- బుధవారం ఒక్కరోజే 61 నామినేషన్లు
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాల, ఆర్మూర్‌లో రాకేశ్‌రెడ్డికి మద్దతుగా కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్భట్హాజరయ్యారు. బాల్కొండ బీజీపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ నామినేషన్ ప్రోగ్రామ్‌కు ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్ అటెండ్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 25 నామినేషన్లు దాఖలయ్యాయి.
నిజామాబాద్‌అర్బన్ నుంచి ధన్పాల్(బీజేపీ), ఫజల్ కరీం(ఎన్సీపీ), ఎండీ జహీరుద్దీన్(ఎంబీటీ), మౌలానా ఖాన్(ఇండిపెండెంట్), లక్క అశోక్ (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ) నామినేషన్లు వేశారు. రూరల్ నుంచి గుగులోత్ బాలరాజ్(ఇండిపెండెంట్), బీబీ నాయక్(ఇండిపెండెంట్), బాల్కొండలో అన్నపూర్ణమ్మ (బీజేపీ), పల్లికొండ నర్సయ్య (బీఎస్పీ), ఆర్మూర్‌లో పైడి రాకేశ్‌రెడ్డి (బీజేపీ), రాజేశ్(ఇండిపెండెంట్) నామినేషన్లు వేశారు. బోధన్ గోపి కిషన్ (శివసేన), మోహన్‌రెడ్డి (బీజేపీ), ఎండీ యూసుఫ్(ఇండిపెండెంట్), సయ్యద్ అస్గర్(ఇండిపెండెంట్), రజితవాణి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), మోసిన్(ఎంసీపీఐ), బాన్సువాడ నుంచి కాసుల రోహిత్(ఇండియన్నేషనల్ కాంగ్రెస్), కాసుల బాలరాజ్(కాంగ్రెస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), కూనింటి రామ్(ఇండిపెండెంట్), డి.సుభాష్ (ఇండిపెండెంట్), షేక్ గౌస్(ఇండిపెండెంట్), గోపాల్(ఎంసీపీఐ), తోట శ్రీకాంత్(ధర్మసమాజ్‌పార్టీ) నామినేషన్లు వేశారు. కామారెడ్డి జిల్లాలో 36 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తరపున మాజీమంత్రి షబ్బీర్‌అలీ నామినేషన్లు వేశారు.
ఉడుతవార్ సురేశ్‌గౌడ్(బీఎస్పీ), సిరిగాధ సిద్ధిరాములు (బీఎల్ఎఫ్), ఇండిపెండెంట్లుగా ముత్యం, నర్సింలు, ఎర్రోల్ల నరేశ్, చిందం మల్లయ్య, నీల నాగరాజు, ఆకుల హరీశ్, చెవుల పరశురాములు, దొడ్లే రాజేందర్, మాధవ్‌రెడ్డి నామినేషన్‌వేశారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్మోహన్రావు, జమున (బీఎస్పీ), అమర్‌సింగ్ (ఆమ్ఆద్మీ పార్టీ), లక్ష్మయ్య (ధర్మ సమాజ్‌పార్టీ), ఇండిపెండెంట్లుగా బద్యా నాయక్, బంతిలాల్మంజా నామినేషన్ దాఖలు చేశారు. జుక్కల్‌లో అరుణతార (బీజేపీ), హన్మంత్ షిండే తరపున (బీఆర్ఎస్), బాబు (బహుజన భారత్‌పార్టీ), భూమయ్య (ధర్మ సమాజ్‌పార్టీ), ఇండిపెండెంట్లుగా రాజు, సాయిలు, గైని ప్రేమ్‌కుమార్, గైక్వాడ్ప్రకాశ్ నామినేషన్ వేశారు.