తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలకు కోసం భారీ ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా పెన్షన్లు, ఇండ్లు, గ్యాస్ వంటి పథకాలకోసం ఎక్కువగా అప్లికేషన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో అభయ హస్తం పథకాలకోసం దరఖాస్తులు చేసుకున్నారు. శనివారం( డిసెంబర్30) న ఒక్కరోజే అభయహస్తం పథకాలకోసం 3లక్షల 47వేల 669 అప్లికేషన్లు వచ్చాయి.
ఇతర అప్లికేషన్లు 74వేల 821 రాగా, గడిచిన మూడు రోజుల్లో ఇప్పటివరకు 9లక్షల 92వేల 234 అప్లికేషన్లు రాగా.. గడిచిన మూడు రోజుల్లో అభయహస్తం పథకాల కోసం 8,46,097 అప్లికేషన్లు అందయని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.