ప్రజావాణికి 395 అర్జీలు

ప్రజావాణికి  395 అర్జీలు

​పంజాగుట్ట,వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావ్​ఫూలే ప్రజాభవన్​లో మంగళ వారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై , అర్జీలు అందించారు. మొత్తం 395 ఫిర్యాదులు అందగా వాటిలో హౌసింగ్​ సంబంధించి 125, రెవెన్యూ విభాగానికి చెందినవి 50,ఎనర్జీ విభాగానికి చెందినవి 36,మైనారిటీ వెల్ఫేర్​కు చెందినవి 30, పీఆర్​ అండ్​ ఆర్డీ విభాగానికి 28, ప్రవాసీ ప్రజావాణికి 5, ఇతర విభాగాలకు చెందినవి 121 ఉన్నాయని ప్రజావాణి అధికారులు తెలిపారు.