
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు కోటి రూపాయల విలువ చేసే 200 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలోనే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా సెప్టిక్ ట్యాంకర్లో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మరి కాసేపట్లో అధికారులు మీడియాకు వెల్లడించనున్నారు.
ALSO READ | 14 కిలోల బంగారంతో ఎయిర్ పోర్ట్లో దొరికిపోయిన సినీ నటి.. ఆ బంగారం విలువ 12 కోట్లు..!
కాగా, రాష్ట్రంలో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై కొరడా ఝులిపిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ డ్రగ్ స్మగ్లర్ల భరతం పడుతున్నారు.