
మహదేవపూర్,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్గులలో మంగళవారం రైతు కంటపడింది. ఉదయం గ్రామానికి చెందిన నిట్టూరి బాపు ఎడ్లబండి పై వెళ్తుండగా.. ఒకచోట ఎడ్లు ఆగిపోయాయి. ఎంత అదిలించినా ముందుకు కదలలేదని, పక్కనే గడ్డ ఎక్కి చూస్తే పులి నడుచుకుంటూ వెళ్లిందని రైతు బాపు తెలిపాడు.
భయంతో ఎడ్లను వెనక్కి మలుపుకుని గ్రామానికి వెళ్లిపోయినట్టు చెప్పాడు. పది రోజులుగా గోదావరి పరివాహక అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఏదో ఒక చోట దాని పాద ముద్రలను ఫారెస్టు ఆఫీసర్లు గుర్తిస్తున్నారు. ట్రాకింగ్ కెమెరాలు పెట్టామని పులి చిక్కితేనే వివరాలు తెలియజేస్తామని ఫారెస్టు ఆఫీసర్ తెలిపారు.