
కందనూలు, వెలుగు: బిజినేపల్లి మండలం గంగారం ఫారెస్ట్ లో చిరుత పులులు సీసీ కెమెరాలకు చిక్కాయి. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో ఉన్న చిరుతపులులు పక్కనే ఉన్న తండాల్లో పశువులపై దాడి చేస్తున్నాయి. స్పందించిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంగారం ఫారెస్ట్ సమీపంలోని నేరేడువంపు సోలార్ పంప్‌సెట్ వద్ద నీళ్లు తాగుతూ చిరుత కనిపించింది. చిరుతతో పాటు సాంబార్లు కూడా సీసీ కెమెరాలో కనిపించాయి. అవసరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.