తిరుపతి: అమ్మయ్యా.. చిరుతను బంధించారు.. ఎస్వీ జూపార్క్ కు తరలించిన అధికారులు

తిరుపతి: అమ్మయ్యా.. చిరుతను బంధించారు.. ఎస్వీ జూపార్క్ కు తరలించిన అధికారులు

తిరుపతిలోని  ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎట్టకేలకు  అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత కొద్దిరోజులుగా అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. అటవీ అధికారులు వేదిక్​ యూనివర్శిటీ దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది.  కొంతకాలం నుంచి ఎస్వీయూ క్యాంపస్‌లో రాత్రివేళ సంచరిస్తూ అటు విద్యార్థులు, సిబ్బందిని.. ఆ మార్గంలో వెళ్లే వారిని హడలెత్తించింది. దీని దెబ్బకు క్యాంపస్ చుట్టుపక్కల చిరుత సంచారంపై బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళ ఎస్వీయూ ప్రాంగణంలో బయట తిరగకూడదని సైతం అధికారులు హెచ్చరించారు

చిరుత సంచరిస్తుందని అటవీశాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఎస్వీయు క్యాంపస్ లోబోనులు, కెమెరాలను ఏర్పాటు చేశారు. కుక్కల కోసం నివాస ప్రాంతాల దగ్గరికి  చిరుత రావడంతో  రాత్రి  పూట భయం స్థానికులు గడుపుతున్నారు.ఎస్వీ   క్యాంపస్ లోని ఓ బోనులో అమర్చిన బోనులో వచ్చి చిక్కింది. చిరుతకు మత్తు ఇచ్చి ఎస్వీ జూపార్క్ కు తరలించారు