బొద్దింకను ఇంట్లో ఎక్కడైనా మూలన చూస్తేనే కొందరికి చిరాకు.. ఇంకొందరికి భయం.. అదే తినే ఫుడ్ లో కనిపిస్తే. ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఇండియాలో ప్రజలు రైల్వే జర్నీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇటీవల కాశీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. పర్వేజ్ హష్మీ ముంబైలోని గోరఖ్ పూర్ మరియు లోకమాన్య తిలక్ టర్మినల్ మధ్య నడిచే ట్రైన్ నంబర్ 15018లో ప్రయాణించాడు.
ఆ టైంలో (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరింగ్ కార్పొరేషన్ (IRCTC) నుంచి వెజ్ థాలీ ఆర్డర్ చేశాడు. ఫుడ్ బాక్స్ ఓపన్ చేయగానే దాంట్లో బతికున్న బొద్దింక ప్రత్యక్షమైంది. గులాబ్ జామ్ పై అది అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దాన్ని అతను వీడియో తీసి ఇండియన్ రైల్వే సోషల్ మీడియా అకౌంట్ కు ట్యాగ్ చేశాడు.