కరెంటు వైర్లు తగిలి గడ్డితో వెళ్తున్న లారీ దగ్ధం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడ్ తో వెళ్తున్న లారీ మంటల్లో దగ్ధమైంది. విషయం తెలియగానే వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. అయితే.. అప్పటికే లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. 

మేడిపల్లి నుంచి గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ గ్రామానికి లారీ వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగింది. లారీకి మంటలు అంటుకోవడంతో సమీపంలోని టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపైకి మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో దానిపై ఉన్న వ్యక్తి..తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.30 వేల విలువ గల గడ్డి కాలిపోయింది. ఒక టీవీఎస్ ఎక్సెల్, లారీ మంటల్లో కాలిపోయాయి.