
మల్కాజిగిరి: హబ్సిగూడ మెయిన్‌రోడ్డుపై గ్యాస్సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఫుట్పాత్దుకాణాలపైకి దూసుకువెళ్లింది. చిరువ్యాపారులు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ నుంచి మల్లాపూర్వైపు హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ హెచ్ఎంటీ రోడ్డు ప్రాంతానికి రాగానే ఫుట్‌పాత్‌పై దుకాణాల వైపు దూసుకువెళ్లింది. గమనించిన చిరువ్యాపారులు బండ్లను వదిలేసి పరుగులు తీశారు. దీంతో లారీ కొబ్బరిబొండాలు, అరటిపండ్లు, పూలబండి, టీ-స్టాల్, మరికొన్ని చిరువ్యాపారుల తోపుడు బండ్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్‌కు ఫిట్స్రావడంతో ఈ ఘటన జరిగింది. లారీ వేగంగా ఉండి ఢీకొడితే సిలిండర్లు పేలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.