ఆలింపూర్​ సమీపంలో లారీ బోల్తా..  మామిడికాయల లోడు ఖాళీ

ఆలింపూర్​ సమీపంలో లారీ బోల్తా..  మామిడికాయల లోడు ఖాళీ

బచ్చన్నపేట, వెలుగు:  మామిడికాయల లోడుతో  వస్తున్న లారీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్​ సమీపంలో బుధవారం అర్ధరాత్రి బోల్తాపడింది. సూర్యాపేటలో మామిడికాయలు లోడు చేసుకున్న లారీ సిద్దిపేట జనగామ హైవేపై ఆలింపూర్​ గ్రామం దాటుతున్న సమయంలో మూల మలుపు వద్ద  ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

 దీంతో లారీలో ఉన్న మామిడికాయలు రోడ్డుపై పడిపోయాయి.  హైవే వెంట వెళ్లేవారు మామిడికాయలను సంచుల్లో నింపుకొని పోయారు.  తెల్లవారే సరికి సగానికిపై లోడు ఖాళీ అయింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.