మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 4న అర్థరాత్రి 2గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ పూర్తిగా దగ్ధం కావడంతో అందులో ఉన్న డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు.
మియాపూర్ నుంచి బండ్లగూడకు వెళ్తున్న చెత్త లారీ ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తుండగా గౌడవెళ్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై పోయింది. డ్రైవర్ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మృతి చెందిన వ్యక్తి అయ్యప్ప మాలలో ఉన్న డ్రైవర్ సందీప్ (27 )గా గుర్తించారు.