కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

కరీంనగర్ జిల్లాలో ఇవాళ (డిసెంబర్ 16న) తెల్లవారుజామున కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు మృతిచెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

గాయపడ్డ వ్యక్తిని కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఈ ఘటన జరిగింది. కారు కరీంనగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 

మృతుల వివరాలు : 

* ఆకాష్ (22), జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి
* శ్రావణ్ (32), టేకుమట్ల మండలం ఏంపేడు