- బస్సు డ్రైవర్తోపాటు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
కామారెడ్డి జిల్లా: ఆర్టీసీ బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. అయితే పెను ప్రమాదం తప్పిపోయింది. బస్సు డ్రైవర్ తోపాటు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భిక్కనూర్ మండలం బైపాస్ వద్ద జరిగిందీ ఘటన.
భిక్కనూర్ బస్టాండు నుంచి కామారెడ్డికి బయలుదేరిన బస్సు బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హఠాత్తుగా వెనుకవైపునుంచి వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. డ్రైవర్ తో పాటు, పదిమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.