
వేములవాడ, వెలుగు : వేములవాడ బైపాస్‌పై ముందు వెళ్తోన్న కారును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టింది. కరీంనగర్ జిల్లా గంగధారకు చెందిన రామిడి జలపతి, విజయలక్ష్మి దంపతులు సిరిసిల్లకు వెళ్లి వస్తుండగా వేములవాడ పట్టణంలోని బైపాస్ పై ఎల్ఐసీ ఆఫీస్ వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ దాటి పల్టీ కొట్టింది. జలపతి, విజయలక్ష్మి సీట్ బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.