- మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఘటన
కొత్తకోట, వెలుగు : షిర్డీ వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో వనపర్తి జిల్లాలోని కొత్తకోటకు చెందిన ముగ్గురు చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కథనం ప్రకారం..కొత్తకోటకు చెందిన కుమ్మరి కృష్ణ కూరగాయల వ్యాపారి. ఇతడు తన భార్య వసుధ(32), కూతురు లౌక్య, కొడుకు శ్రీమాన్(4) , పెబ్బేరుకు చెందిన స్నేహితుడితో కలిసి గురువారం సాయంత్రం కారులో శిరిడీకి బయలుదేరాడు.
శుక్రవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో వీరి కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వసుధ, శ్రీమాన్, పెబ్బేరుకు చెందిన కృష్ణ స్నేహితుడు అక్కడికక్కడే చనిపోయారు. కృష్ణ, లౌక్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఔరంగాబాద్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. డెడ్‌బాడీలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లారు.