ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

నల్లగొండ : చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో ఆగి ఉన్న లారీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం జీఎంఆర్ సిబ్బంది, పోలీసులు కలిసి ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేస్తున్నారు.