పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లిన లారీ

పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లిన లారీ
  •     తప్పిన పెను ప్రమాదం

హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి మండల కేంద్రంలోని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఓ రెడీ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి పక్కనే ఉన్న పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన లారీని ఢీకొని పల్టీ కొట్టింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పల్టీ కొట్టిన లారీలో ఉన్న ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్రేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయంతో లారీని పైకి లేపారు.