
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలంలోని బూరుగూడాలో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోగా, కరెంట్స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పలువురు గాయపడ్డారు. గాలి తీవ్రత ఎంతలా ఉందంటే రోడ్డు పక్కన నిలిపిన ఓ లారీ సైతం బోల్తా పడింది.