సారంగదరియా చిత్రం నుండి అందుకోవా అనే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ విడుదల

సారంగదరియా చిత్రం నుండి అందుకోవా అనే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ విడుదల

రాజా రవీంద్ర లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సారంగదరియా’. ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మాతలు.  ఎం  ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమా నుంచి శుక్రవారం ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను నవీన్ చంద్ర విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘అందుకోవా.. ఆకాశం అదిగో.. అంత సులువా అనుకుంటే అవవే.. పొందలేవా అవకాశం ఇదిగో..’ అంటూ సాగిన పాటను  సింగర్ కె ఎస్ చిత్ర పాడిన విధానం ఆకట్టుకుంది.

రాంబాబు గోశాల రాసిన లిరిక్స్ ఆలోచింపజేస్తున్నాయి.  ఇదొక ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషనల్ సాంగ్.  ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా సాగిందీ పాట. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. చిత్రగారు పాడిన ఈ పాట సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తుంది’ అని అన్నారు.