మైలార్​దేవ్​పల్లిలో డీసీఎం దగ్ధం

శంషాబాద్, వెలుగు: మైలర్ దేవ్ పల్లి పీఎస్​పరిధిలోని ఓ అట్టల గోదాంలో పార్క్ చేసిన డీసీఎం వెహికల్​దగ్ధమైంది. రైల్వే బుద్వేల్ ఇంద్ర గాంధీ సొసైటీలోని మంగళ కాటాన్ల వేస్టేజ్ గోదాంలో పార్క్​చేసిన డీసీఎంలో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ స్టార్ట్​చేసి గోదాం బయటకు తీసుకెళ్లి ఆపాడు.

మంటలు మొత్తం వ్యాపించి డీసీఎం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డీసీఎంలో మెటీరియల్ ఉన్నట్లు తెలిపారు.  

ఫోర్త్​ఫ్లోర్​లో మంటలు

జీడిమెట్ల: పేట్ బషీరాబాద్ పీఎస్​పరిధిలోని ఓ బిల్డింగ్​నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. పద్మానగర్ ఫేజ్–2లోని అపార్ట్​మెంటు నాలుగో అంతస్తులో శ్రీను అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఫ్లాట్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీను ఫ్యామిలీతోపాటు చుట్టుపక్కలవారు భయంతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.