
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కంట్లూర్ లోని రావినారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 26న గుడిసెలు తగలబడి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాలు దట్టమైన పొగలతో అలుముకున్నాయి. ఒక్కసారిగా గుడిసెలకు మంటలు అంటుకొని వ్యాపించడంతో పరుగులు తీశారు స్థానికులు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
గత నాలుగేళ్ళ క్రితం భూదాన్ భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు పేదలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఇవ్వకపోవడంతో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఘటనా స్థలంలో సుమారు 6 నుంచి 8వేల గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికైనా ప్రమాదం జరిగిందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గుడిసెలకు ఆకతాయిలు నిప్పు పెట్టారా? లేక ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా అనేది తెల్వదు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.